- Advertisement -
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. పలిమేల మండలం ముకునూరు గ్రామానికి చెందిన దుగ్గిరాల రంగారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. వారి కుటుంబ సభ్యులను ఆదివారం శ్రీనుబాబు పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇదే గ్రామానికి చెందిన తిప్పనపల్లి ముత్తయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -



