Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇన్చార్జి ఎఫ్ఏఓ మధుసూదన్ సమగ్ర శిక్ష అభియాన్ కి సరెండర్.

ఇన్చార్జి ఎఫ్ఏఓ మధుసూదన్ సమగ్ర శిక్ష అభియాన్ కి సరెండర్.

- Advertisement -

నవతెలంగాణ –  భూపాలపల్లి : హనుమకొండ డి ఈ ఓ కార్యాలయంలో ఎస్ ఎస్ ఎ విభాగం లో ఎఫ్ ఏ ఓ గా పనిచేస్తూ జయశంకర్ భూపాలపల్లికి ఇంచార్జి ఎఫ్ఏఓగా పనిచేస్తున్న ఏ మధుసూదన్ ను స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ కు హన్మకొండ కలెక్టర్ సరెండర్ చేశారు. ఈ రెండు జిల్లాల్లో కూడా ఆయన మీద అనేక ఆరోపణలు తలెత్తిన క్రమంలో హనుమకొండ జిల్లాలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇతని మీద జిల్లా విద్యాధికారికి కంప్లైంట్ చేశారు. కలెక్టర్ ఒక కమిటీని నియమించి ఎంక్వయిరీ చేశారు. ఇతని మీద మోపిన ఆరోపణలు నిజమని తేలడంతో సంబంధిత అధికారులు ఇతన్ని ఆ పోస్టు నుండి తప్పించి స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ కు సరెండర్ చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తి మా భూపాలపల్లి జిల్లా నుండి కూడా తొలగించాలని కొన్నిఉపాధ్యాయ సంఘాలు ,విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -