Monday, June 8, 2026
E-PAPER
Homeసినిమాసరికొత్త అనుభూతినిచ్చే సినిమా

సరికొత్త అనుభూతినిచ్చే సినిమా

- Advertisement -

నేపథ్య గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా, భైరవి అర్ధ్యా కథానాయికగా నటించిన చిత్రం‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా సీనియర్ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రానికి పెద్ద విజయాన్ని అందించాలిఅని తెలిపారు. 'రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జోనర్‌లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం అని దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి చెప్పారు.
నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ, ‘మా సినిమా బాగుందని బ్లెస్సింగ్ అందించిన ప్రముఖ దర్శకులు ఏ కోదండరామిరెడ్డికి కృతజ్ఞతలు. ఇది నాకు తొలి సినిమా. దర్శకుడికి తొలి చిత్రం. హీరోయిన్‌కు తొలి సినిమా. హీరో ఆకాష్‌కు రెండో సినిమా. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కమెడియన్ మహేంద్ర సినిమాలో చేసిన కామెడీ హైలెట్ గా నిలుస్తుంది` అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -