- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బెంగళూరులో ఏఐసీసీ కార్యదర్శి, కర్ణాటక ప్రభుత్వ గ్యారెంటీ కమిటీ వైస్ చైర్మన్ సూరజ్ హెగ్డే (55) ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. మాజీ సీఎం దేవరాజ్ అర్స్ మనవడైన ఆయన మృతికి కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, డి.కె. శివకుమార్, ప్రియాంక గాంధీ, సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం ప్రకటించారు. వెనుకబడిన తరగతులు, దళితుల అభ్యున్నతికి, ప్రభుత్వ గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సూరజ్ నిరంతరం కృషి చేశారని వారు కొనియాడారు.
- Advertisement -



