ఎస్సై చిర్ర రమేష్ బాబు
నవతెలంగాణ-నెల్లికుదురు
ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులు మరియు డీలర్లు ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ అమ్మితే చట్టమైన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ ఎస్సై చిర్ర రమేష్ బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వాహకులకు డీలర్లకు సమావేశాన్ని సోమవార0 నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫర్టిలైజర్ యాజమాన్యం తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్క నిర్వహకుడు పాటించాలని అన్నారు. లేని యెడల వారిపై చట్టమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
ఏ ఒక్కరు కూడా ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ విక్రయించడం కానీ బ్లాక్ మార్కెట్ చేయడం గాని చేయరాదని అలా ఎవరైనా చేసినట్లయితే వారిపై తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించినట్లు చెప్పారు. తప్పనిసరిగా అన్ని షాపుల వద్ద స్టాక్ బోర్డ్స్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. తప్పనిసరిగా ప్రతి డీలర్ కూడా ప్రభుత్వ నిబంధన ప్రకారం నడుచుకోవాలని లేనియెడల వారిపై చర్యలు తీసుకోబడతాయని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , ఏ ఈ ఓ లు, సుమలత మణికంఠ,ధరణీశ్, ప్రతిభ, భవానీ లు మరియు మండల ఫర్టిలైజర్ షాప్స్ డీలర్స్ పాల్గొన్నారు.



