- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలో నూతనంగా నిర్వహించనున్న ప్రీ ప్రైమరీ పాఠశాలల సిబ్బంది నియామకాలు కు భారీ గా దరఖాస్తులు అందుతున్నాయి. సోమవారం చివరి గడువు కావడం సాయంత్రం అయిదు దాటినా దరఖాస్తు దారులు క్యూలో ఉన్నారు. మండలంలోని 14 ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టులు కు వార్త రాసే సమయానికి 1869,13 ఆయా పోస్ట్ లకు 53 దరఖాస్తులు అందినట్లు ఎంఈఓఈ ప్రసాదరావు తెలిపారు.
- Advertisement -



