నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రెవెన్యూ శాఖలో భారీ భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 2013-18 మధ్య హౌసింగ్ బోర్డులో భూసేకరణ అధికారిగా పనిచేసిన సమయంలో రాము నాయక్ పలు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పరిశీలన చేస్తుండగా ఈ లీలలు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్లో గజం రూ.2 లక్షలకు పైగా పలికే హైకోర్టు సమీపంలోని హౌసింగ్ బోర్డు స్థలాన్ని, గతంలో తొలగించబడిన వర్క్ ఇన్‌స్పెక్టర్ భార్య పేరిట 2018లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. దీనికి సహకరించిన నాటి చార్మినార్ సబ్ రిజిస్ట్రార్‌పైనా విచారణకు ఆదేశించారు.
డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ పై సస్పెన్షన్ వేటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



