Monday, June 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వయోవృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు

వయోవృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు

- Advertisement -

27 మందికి ఆపరేషన్ల కోసం తరలింపు
నవతెలంగాణ – పరకాల 

పరకాల ప్రాంతంలోని వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్‌లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. వయోవృద్ధుల సంక్షేమ సంస్థ మరియు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌లోని శంకర కంటి ఆసుపత్రి వైద్యుల సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన 97 మంది వయోవృద్ధులకు బిపి, షుగర్ మరియు కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించిన 27 మంది వృద్ధులను ఆపరేషన్ల కోసం హైదరాబాద్‌లోని శంకర కంటి ఆసుపత్రికి తరలించారు. గతంలో ఇదే సెంటర్‌లో నిర్వహించిన మెగా కంటి పరీక్షల క్యాంపులో ఎంపికై, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని కూడా ఈ సందర్భంగా వైద్యులు సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ సంస్థ అధ్యక్షులు రేపాల నరసింహ రాములు మాట్లాడుతూ, 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ డే కేర్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంట్లో ఒంటరితనాన్ని అనుభవించే వారు, మనశ్శాంతిని కోరుకునే వృద్ధులు ఇక్కడకు వచ్చి ప్రశాంతంగా గడపవచ్చని, వారికి టీ, బిస్కెట్లతో పాటు వేసవిలో రాగి జావ, మజ్జిగ వంటి పౌష్టికాహార సౌకర్యాలను డే కేర్ సెంటర్ నిర్వాహకులు, ప్రగతి సేవా సంస్థ అందిస్తున్నారని వివరించారు. అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ పింగిలి విజయపాల్ రెడ్డి అందించిన మందులను వృద్ధులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ డే కేర్ సెంటర్ ఇంచార్జ్ రాజ్ కుమార్, స్టాఫ్ ఎం. శివ నాగులు, వయోవృద్ధుల సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి బూసి ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎడ్ల సుధాకర్, సహాయ కార్యదర్శి ముదురుకోళ్ల సంపత్, ట్రెజరర్ పిట్ట వీరస్వామి, శంకర కంటి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -