గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొత్త మలుపు’. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో ఆకాష్ మీడియాతో ముచ్చటించారు. నా తొలి సినిమా‘సర్కారు నౌకరి’ ఒక పీరియడ్ డ్రామా అయితే, ‘కొత్త మలుపు’ పూర్తిగా భిన్నమైన జోనర్లో రూపొందింది. ఇది కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే విలేజ్ రొమాంటిక్ లవ్, సస్పెన్స్ ఎంటర్ టైనర్. లవ్, కామెడీ, ఎమోషన్స్‌తో పాటు కథను ముందుకు నడిపే ఆసక్తికరమైన సస్పెన్స్ కూడా ఉం టుంది. ప్రేక్షకులకు కొత్త అను భూతిని ఇస్తుందని నమ్ముతున్నాను. కథకు తగినట్టే దర్శకులు ఏ కోదండరామిరెడ్డి సినిమాకు ఈ టైటిల్ సూచించారు. ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నేటి యువత ఆలోచనలు, వారి భావోద్వే గాలకు దగ్గరగా ఉండే పాత్ర ఇది. దర్శకుడు శివ వరప్రసాద్ కథ చెప్పినప్పుడు అందులోని ట్విస్టులు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నేను ఎలా అయితే సరదాగా సాగిపోయే పాత్ర ఉండాలో అచ్చం అలాంటి పాత్రతో కూడిన సబ్జెక్టును డైరెక్టర్ నాకు చెప్పగానే బాగా నచ్చింది. ఇక టైటిల్‌కు తగ్గట్టే కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులు ఊహిం చలేరు. కోనసీమ అందాలను అందంగా చూపిస్తూ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కథను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమా విషయంలో నిర్మాత తాటి బాలకృష్ణ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.
మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మా సినిమాకు చాలా పెద్ద బలం. ఇలాంటి దిగ్గజ సంస్థ మా సినిమాను విడుదల చేయడం వల్ల ప్రేక్షకుల్లో మరింత నమ్మకం పెరిగింది. కంటెంట్‌పై విశ్వాసం తోనే వారు ముందుకు వచ్చారు. దీని వల్ల సినిమా మరింత మందికి చేరుతుందని భావిస్తున్నాం.
ప్రేక్షకులు ఊహించని మలుపులు ఉంటాయ్
- Advertisement -
- Advertisement -



