- Advertisement -
నవ తెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని పాత హైస్కూల్ క్రీడా మైదానంలో ఆకుల లక్ష్మీ స్మారకార్థం మండల స్థాయి షటిల్ టోర్నీని తాడిచెర్ల పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ ఇప్ప మొశీడయ్య మంగళవారం ప్రారంభించారు. గురువారం వరకు కొనసాగనున్న ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి రూ.5016,ద్వితీయ బహుమతి రూ.3016,బెస్ట్ ప్లేయర్ కు ప్రత్యేక అవార్డు ఇవ్వడం జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.
- Advertisement -


