Tuesday, June 9, 2026
E-PAPER
Homeజాతీయంవిశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 
ఘోర ప్రమాదం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 
ఘోర ప్రమాదం

- Advertisement -

9 మంది మృతి, పలువురికి గాయాలు
స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ప్రమాదం

విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉక్కుకర్మగారంలోని ఎస్ఎంఎస్-2, ఎస్టీసీ-3, హీట్ ఎఫ్జీలో భారీ మొత్తంలో ఉక్కుద్రవం లీకవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఉక్కుద్రవాన్ని లిఫ్ట్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడినట్టు గా సమాచారం. కాగా మంటలు చెలరేగడంతో కార్మికులు, ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు స్టీల్ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు.

ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆయన అధికారులతో మాట్లాడారు. పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. సహాయక చర్యల గురించి స్టీల్ ప్లాంట్ అధికారులు సీఎంకు వివరించారు. అన్నిశాఖల సమన్వయంతో సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -