Tuesday, June 9, 2026
E-PAPER
Homeజాతీయంఅంగీకారం ఉన్న సంబంధాన్ని 
తప్పుపట్టలేం

అంగీకారం ఉన్న సంబంధాన్ని 
తప్పుపట్టలేం

- Advertisement -

అది వ్యక్తిత్వంపై మచ్చ కాదు : సుప్రీం వ్యాఖ్యలు
అంగీకారం ఉన్న సంబంధాన్ని తప్పుపట్టలేం


న్యూఢిల్లీ
: వివాహానికి ముందు పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం, వ్యక్తిత్వానికి మచ్చ కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి సంబంధాన్ని ఆ వ్యక్తి గుణానికి మచ్చగా పరిగణించలేమని పేర్కొంది. అధికారులు మారుతున్న సామాజిక ప్రమాణాల పట్ల సున్నితంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. జస్టిస్‌ ‌మనోజ్‌ ‌మిశ్రా, జస్టిస్‌ ‌మన్మోహన్‌‌లతో కూడిన బెంచ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. క్రమశిక్షణ కలిగిన బలగాల్లో రిక్రూట్‌‌మెంట్‌ ‌సమయంలో వ్యక్తిత్వ ధృవీకరణ అనేది అంతర్భాగంగా కొనసాగుతుందని, కానీ సమకాలీన సమాజంలో వివాహ పూర్వ సంబంధాలు సర్వసాధారణమవుతున్నాయని పేర్కొంది. అందువల్ల వీటిని ఒక వ్యక్తి వ్యక్తిత్వంపై నింద వేయడానికి సాకుగా ఉపయోగించరాదని పేర్కొంది. నేటి సమాజంలో మారుతూ వస్తున్న పరిస్థితులను అధికారులు కూడా గమనంలోకి తీసుకోవాలని కోరింది. పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్ధి సెలక్షన్‌‌ను తెలంగాణా రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌‌మెంట్‌ ‌బోర్డు రద్దు చేసిన కేసులో ఈ రూలింగ్‌ ‌వెలువడింది. సదరు అభ్యర్ధి విఫలమైన ప్రేమ వల్ల తలెత్తిన క్రిమినల్‌ కేసులో వున్నందుకు ఆ సెలక్షన్‌‌ను రద్దు చేశారు. దీనిపై ఆ అభ్యర్ధి చేసుకున్న అప్పీల్‌‌ను విచారణకు స్వీకరిస్తూ, డివిజన్‌ ‌బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అంతకుముందు తెలంగాణా హైకోర్టు సింగిల్‌ ‌జడ్జి ఇచ్చిన తీర్పును పునరుద్ధరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -