Thursday, February 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎఫ్‌పీఓల ఏర్పాటులో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి

ఎఫ్‌పీఓల ఏర్పాటులో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి

- Advertisement -

– సీఎంఓ కార్యదర్శి శేషాద్రితో భేటీలో రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఎఫ్‌పీఓల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎంఓ కార్యదర్శి శేషాద్రితో ఆయన భేటీ అయ్యారు. రైతు కమిషన్‌ ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో చేసిన పర్యటనలు, అక్కడ అమలవుతున్న వ్యవసాయ, మార్కెటింగ్‌ విధానాలపై కమిషన్‌ తయారు చేసిన నివేదికలను ఆయనకు అందించారు. ప్రధానంగా ఎఫ్‌పీఓల విషయంలో తెలంగాణ వెనుకంజలో ఉందనీ, ఇతర రాష్ట్రాల్లో ఎఫ్‌పీఓలు బలంగా పనిచేస్తున్నాయని కోదండరెడ్డి వివరించారు. కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైతులు ఆర్ధికంగా బలోపేతం కావడంలో ఎఫ్‌పీఓలు కీలకంగా పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు. రైతు కమిషన్‌ కేరళ, మహారాష్ట్రలోని నాసిక్‌లో పర్యటించిన సమయంలో ఎఫ్‌పీఓల ప్రభావం స్పష్టంగా కనిపించిందన్నారు. కేంద్రం కూడా ఎఫ్‌పీఓల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్న విషయాన్ని కూడా సీఎంవో సెక్రెటరీ శేషాద్రికి కోదండరెడ్డి గుర్తుచేశారు. నాసిక్‌లోని సహ్యాద్రి ఎఫ్‌పీఓ దేశంలోనే ఆదర్శంగా పనిచేస్తుందని వివరించారు. తెలంగాణలో కూడా ఎఫ్‌పీఓల ఏర్పాటులో ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటుందని కోరారు. అదేవిధంగా మార్కెటింగ్‌ వ్యవస్థ, కౌలు రైతు విధానాలపై కేరళ రాష్ట్రంలో అమలవుతున్న పాలసీలపై కమిషన్‌ రూపొందించిన నివేదికలను సైతం సీఎంవో సెక్రెటరీకి అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -