- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి అటవీ విభాగంలో మంగళవారం పలుచోట్ల భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఖాడియాన్, అండ్రోలా, చక్కిలి, మియాహాడి, బథుని బ్లాక్‌లలోని అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తేవడానికి శ్రమిస్తున్నారు. అదనపు సిబ్బందిని కేటాయించి మంటలను అదుపులోకి చేస్తున్నామని అటవీ శాఖ అధికారి రాజేష్ కుమార్ తెలిపారు.
- Advertisement -



