నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితమైన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది.
ఈ చారిత్రక విజయం తర్వాత జట్టు స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. జట్టు ప్రయాణాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేసుకుంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. “నమ్మకంతో ఈ సీజన్‌ను ప్రారంభించాం. వరుస టైటిళ్లతో ముగించాం. ఈ జట్టు అన్ని భావోద్వేగాలను కలిసే ఎదుర్కొంది. ఎత్తుపల్లాలు, ఒత్తిడి, అడ్డంకులు అన్నింటినీ దాటాం. మాకు అండగా నిలిచిన అభిమానుల మద్దతు మరువలేనిది. ఈ ప్రదేశం మా సొంత ఇల్లులాంటిది కాబట్టి ఈ గెలుపు మరింత ప్రత్యేకం” అని కోహ్లీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు.



