Tuesday, June 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘పెద్ది’ సినిమాపై గిరిజ‌న సంఘాలు ఫిర్యాదు

‘పెద్ది’ సినిమాపై గిరిజ‌న సంఘాలు ఫిర్యాదు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ‘పెద్ది’ సినిమా వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సినిమాలోని కొన్ని సన్నివేశాలు, మహిళా పాత్రల ప్రదర్శనపై విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఇప్పుడు మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. తాజాగా విజయనగరం జిల్లా గిరిజన సంఘాల నేతలు సినిమా పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సినిమాలో ఆదివాసీలను అవమానించేలా, వారి మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని పదాలు, సంభాషణలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.

‘పెద్ది’ విడుదలైన తర్వాత జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా హీరో-హీరోయిన్ మధ్య చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ విమర్శల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందించి, ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లు చెబుతూ అభ్యంతరాలు వ్యక్తమైన కొన్ని సన్నివేశాలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు గిరిజన సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చిత్రబృందం మరోసారి స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో, సినిమా నుంచి మరిన్ని మార్పులు చేపడతారా లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -