Tuesday, June 9, 2026
E-PAPER
Homeబీజినెస్‘బర్గ్ మన్ & అవెనిస్ హ్యాంగ్ అవుట్ పరేడ్’ ని నిర్వహించిన సుజుకీ 

‘బర్గ్ మన్ & అవెనిస్ హ్యాంగ్ అవుట్ పరేడ్’ ని నిర్వహించిన సుజుకీ 

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SMIPL),  సుజుకీ మోటార్ కార్పొరేషన్, జపాన్ వారి టూ-వీలర్ అనుబంధ సంస్థ హైదరాబాద్, తెలంగాణలో ‘బర్గ్ మన్ & అవెనిస్ హ్యాంగ్ అవుట్ పరేడ్’ ని విజయవంతంగా నిర్వహించింది. స్కూటర్ ఔత్సాహికులను ఒక చోట చేర్చింది మరియు కస్టమర్లకు విలక్షణమైన రైడింగ్ అనుభవం ఇచ్చింది, సుజుకీ స్కూటర్ల డిజైన్, సౌకర్యం మరియు పనితీరును విజయవంతమైన  వేడుక చేసింది.

ఈ కార్యక్రమానికి సుజుకీ బర్గ్ మన్, అవెనిస్ కస్టమర్లు పాల్గొన్నారు, ప్రముఖ నగర మార్గాల్లో ఆకర్షణీయమైన ఆన్-రోడ్డు ఉనికిని సృష్టించారు మరియు SMIPL వారి పెరుగుతున్న సుజుకీ సమాజాన్ని పునః శక్తివంతం చేసారు. ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, శ్రీ. దీపక్ ముత్రేజ, వైస్-ప్రెసిడెంట్, సేల్స్ & మార్కెటింగ్, సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ఇలా అన్నారు, “సంప్రదాయబద్ధమైన వేదికలకు మించి కస్టమర్లతో నిమగ్నం చెందడంలో మా ప్రాధాన్యతను ద బర్గ్ మన్ & పరేడ్ హ్యాంగ్ అవుట్ పరేడ్ సూచిస్తుంది. రైడింగ్ సమాజంతో మా బంధాన్ని శక్తివంతం చేస్తూనే మా స్కూటర్ల యొక్క స్టైల్, సౌకర్యం మరియు పనితీరును అనుభవించడానికి అలాంటి కార్యక్రమాలు రైడర్స్ కు అనుమతి ఇస్తాయి. కస్టమర్లతో అనుగుణమైన అర్థవంతమైన బ్రాండ్ అనుభవాలను సృష్టించడానికి మేము కట్టుబడి ఉన్నాము మరియు రాబోయే నెలల్లో మరిన్ని పట్టణాలకు అలాంటి కార్యక్రమాలను తీసుకువెళ్లడానికి మేము ఎదురుచూస్తున్నాము.”

SMIPL డీలర్ షిప్ లైన ఆరుష్ సుజుకీ మరియు పద్మజ సుజుకీ నుండి ప్రారంభించిన బర్గ్ మన్ మరియు అవెనిస్ స్కూటర్ల బృందం సత్వ నెక్లెస్ మాల్ కు చేరుకోవడానికి ముందు అందమైన నగర మార్గాలు మరియు సుప్రసిద్ధి చెందిన హుస్సేన్ సాగర్ సరస్సును దాటుతూ, హైదరాబాద్ రద్దీ వీధుల వెంట ఒక ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. రైడర్స్ నగరంలో వెళ్తుండగా పాల్గొన్నవారికి పరేడ్ ఒక గుర్తుండిపోయే అనుభవంగా మారింది. కలిసి రైడింగ్ చేయడం, తోటి సుజుకీ రైడర్స్ తో సంభాషణలు, ఆకర్షణీయమైన పరిసరాల్లో ప్రయాణించడం మేము ఆనందించారు. బర్గ్ మన్ మరియు అవెనిస్ స్కూటర్స్ యొక్క సౌకర్యం, సాఫీ రైడ్ నాణ్యత, స్టైలిష్ డిజైన్ మరియు రోజూవారీ ఆచరణీయతలను కస్టమర్లు ప్రశంశించారు, ఇవి గమ్యస్థానంతో పాటు ప్రయాణాన్ని కూడా ఆనందకరంగా మార్చాయి. 
ఈ ఆకర్షణీయమైన వాతావరణం వేదిక వద్ద ముగిసింది, ఇక్కడ సుజుకీ సందర్శకులు మరియు పాల్గొన్నవారి కోసం సుజుకీ పరస్పర సంభాషణా వేదికను ఏర్పాటు చేసింది. కీలకమైన ప్రధానాంశాలు:
– కొత్త బర్గ్ మన్ స్ట్రీట్ మరియు అవెనిస్ ప్రత్యేక ఎడిషన్ స్కూటర్ల ప్రదర్శన
– ఔత్సాహికుల కోసం సుజుకీ-బ్రాండ్ ఉత్పత్తులతో కూడిన ప్రత్యేకమైన వాణిజ్య ఉత్పత్తుల జోన్
– ఆకర్షణీయమైన ఏర్పాటు సుజుకీ స్కూటర్ శ్రేణి యొక్క స్టైలింగ్ మరియు ఫీచర్లను అన్వేషించడానికి కస్టమర్లకు అవకాశం కల్పించింది
రైడ్ సుజుకీ స్కూటర్ల కోసం శక్తివంతమైన గుర్తింపును తెచ్చింది, నగరంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సందర్శకులు మరియు ప్రయాణికులను ఆకర్షించింది.
బర్గ్ మన్ & అవెనిస్ హ్యాంగ్ అవుట్ పరేడ్ యొక్క హైదరాబాద్ ఎడిషన్ రైడర్స్ ను ఒక చోటకు తెచ్చింది  మరియు వాస్తవిక ప్రపంచం వాతావరణంలో  బ్రాండ్ ను  ప్రదర్శించే అనుభవపూర్వకమైన  ప్రత్యక్ష కార్యక్రమాలు ద్వారా కస్టమర్లను నిమగ్నం చేయడాన్ని శక్తివంతం చేయడానికి   SMIPL వారు చేసే నిరంతర ప్రయత్నాల ప్రాధాన్యతను సూచిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -