Thursday, February 12, 2026
E-PAPER
Homeకరీంనగర్భక్తులకు అరుదైన అవకాశం-12 జ్యోతిర్లింగాలు ఒకేచోట

భక్తులకు అరుదైన అవకాశం-12 జ్యోతిర్లింగాలు ఒకేచోట

- Advertisement -

– ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రారంభించిన అధికారులు
నవతెలంగాణ – రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన గ్రామీణ వైద్యుడు సదుల సంతోష్-సువర్ణ దంపతులు శివాలయం ఆవరణలో దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను నిర్మించారు. భక్తులు ఒకే ప్రదేశంలో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునేలా ప్రత్యేకంగా స్పర్శ శివలింగాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సదుల సంతోష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విస్తరించిన ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శనం చేసుకోవడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలమని తెలిపారు. భక్తుల ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. గ్రామ ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శివారాధనలో పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో బింగి చిరంజీవి, ఎస్సై సిహెచ్ సుధీర్ రావు, ఆర్‌.ఐ పద్మయ్య హాజరై జ్యోతిర్లింగాలను ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివసేవకులు, భక్తులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -