Wednesday, June 10, 2026
E-PAPER
Homeసినిమా'స్లమ్ డాగ్`.. పూరి జగన్నాథ్ సినిమాలలో బెస్ట్ సినిమా

‘స్లమ్ డాగ్`.. పూరి జగన్నాథ్ సినిమాలలో బెస్ట్ సినిమా

- Advertisement -

డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కాంబోలో రాబో తున్న యాక్షన్-డ్రామా సినిమా ‘స్లమ్ డాగ్’ 33 టెంపుల్ రోడ్’. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోల్లా జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిం చారు. తాజాగా మేకర్స్ చెన్నైలో టీజర్‌ను లాంచ్ చేశారు. హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ,’పూరి జగన్నాథ్ అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిసినిమా తెలుగులో విడుదలైన తర్వాత, దాన్ని తమిళ్‌లో జయం రవి రీమేక్ చేశారు. ఆ చిత్రంలో నేను జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేశాను. ఇప్పుడు పూరి దర్శకత్వంలో హీరోగా సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. పూరి క్షణాల్లో కథలు చెబుతారు. ఆయన చెప్పే ప్రతి కథ, ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనకు ఏం కావాలో చాలా స్పష్టత ఉంటుంది. అలాంటి దర్శకుడితో పని చేయడం నటుడికి చాలా ఈజీగా, చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ సినిమా విడుద లయ్యే ప్రతి భాషలో ప్రేక్షకులకు నచ్చుతుంది.

ఇందులో యాక్షన్, ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇది ఒక ‘యాక్షన్-ఎమోషన్ ప్యాక్డ్’ సినిమా. పూరి జగన్నాథ్ సినిమాలలో ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నాను అని తెలిపారు. ‘ఇది నా తొలి తమిళ్ సినిమా. విజయ్ సేతుపతి లాంటి నటుడు ఒక దర్శకుడికి దొరకడం కంటే ఇంకేం అవసరం లేదు. స్లమ్ డాగ్… ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసిన కథ. ఇందులో రియల్ ఎమోషన్స్ ఉంటాయి. మనం సాధారణంగా బిచ్చగాళ్లను పెద్దగా పట్టించుకోము. కానీ వాళ్ల జీవితాల్లో కూడా ఎన్నో కథలు, భావోద్వేగాలు ఉంటాయి. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, చాలా ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ సినిమాను మేము నెక్స్ట్ జనరేషన్, జెన్-జీ, యూత్ ప్రేక్షకుల కోసం చేశాంఅని డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెప్పారు. నిర్మాత ఛార్మీ కౌర్ మాట్లాడుతూ,' పూరి కనెక్ట్స్ పై పూరి జగన్నాథ్ తో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశాం. కానీ స్లమ్ డాగ్ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది మా తొలి స్ట్రెయిట్ తమిళ్ సినిమా. ఇందులో చాలా రియల్ యాక్షన్‌తో పాటు బలమైన హ్యూమన్ కనెక్షన్ కూడా ఉంటుంది అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -