ఇరాన్‌తో యుద్ధం విరమణ ఒప్పందంపై ట్రంప్ ప్రకటనల లెక్క..
టెహ్రాన్: ‘ఇరాన్‌తో ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. అతిత్వరలోనే డీల్ కుదురుతుంది’.. అని దాదాపు రెండున్నర నెలల కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన మాట ఇది. అప్పటి నుంచి ఆయన ఇదే విషయాన్ని పలుమార్లు వెల్లడిస్తున్నా.. ఒప్పందం మాత్రం ఖరారు కాలేదు సరికదా.. ఉద్రిక్తతలు తీవ్రమవుతూనే ఉన్నాయి. ఈ డీల్ గురించి ట్రంప్ ఇప్పటి వరకు మూడు నెలల్లో 37 సార్లు ప్రకటనలు చేశారు. ఫిబ్రవరి 28న ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్తంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే యుద్ధం ముగింపునకు శాశ్వత శాంతి ఒప్పందం కోసం ఇరాన్‌ను ట్రంప్ చర్చలకు ఆహ్వానించారు. ఆ సమయంలో మార్చి 23న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శాంతి చర్చల్లో చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. ఆ తర్వాత క్యాబినెట్ సమావేశంలో ప్రసంగిస్తూ.. అమెరికాతో ఒప్పందానికి టెహ్రాన్ తీవ్రంగా అభ్యర్థిస్తోందని తెలిపారు. ఏప్రిల్ 6న మరోసారి దీనిపై మాట్లాడుతూ.. ఇరాన్‌తో ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని అన్నారు. ఆ మరుసటిరోజే ఇరుదేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని తెలిపారు. తొలుత రెండు వారాల పాటు ఈ కాల్పుల విరమణ చోటు చేసుకోగా.. ఆ తర్వాత దాన్ని మరికొంతకాలం పొడిగించారు. మరోవైపు, శాంతి చర్చల కోసం ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగాయి. అలా మొత్తంగా ఇప్పటివరకు ట్రంప్ 37 సార్లు డీల్ కుదుర్చుకునేందుకు చాలా దగ్గరగా వచ్చామని ప్రకటన చేసినట్లు మీడియా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఇరాన్ మాత్రం ఎప్పటికప్పుడు అమెరికా అధ్యక్షుడి ప్రకటనలను కొట్టిపారేస్తూనే ఉంది. అగ్రరాజ్య డిమాండ్లను తాము అంగీకరించట్లేదని, ఒప్పందంలో ఏ అంశాల పైనా ఏకాభిప్రాయం కుదరలేదని టెహ్రాన్ చెబుతోంది. దీంతో ట్రంప్ ప్రకటనలపై ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయినట్టు కన్పిస్తోంది.
3 నెలలు.. 37 సార్లు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



