భారత్ లో పేదరికం, అసమానతలపై పరిశోధనల నేపథ్యంలో…
న్యూఢిల్లీ : భారత్ లో పేదరికం, అసమానతలపై చేసిన పరిశోధనలకు గానూ సంక్షేమ ఆర్థికవేత్త జీన్ డ్రీజ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇటీవల పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగిన ప్రపంచ అసమానతల సదస్సులో ఆర్థికవేత్త జీన్ డ్రీజ్ కు గ్లోబల్ ఇనీక్వాలిటీ రీసెర్చ్ అవార్డును ప్రదానం చేశారు. భారతదేశంలో పేదరికం, అసమానతల కొలమానంపై ఆయన చేసిన కృషికి, అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం కోసం చేసిన కృషికి గాను డ్రెజ్‌కు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా డ్రెజ్ మాట్లాడుతూ, “ఈ గుర్తింపును నేను ఒంటరిగా సాధించలేదు. నేను చేసే ఈ పనులన్నీ మార్పు కోసం పని చేస్తున్న వ్యక్తులు, సమూహాలతో కలిసికట్టుగా చేస్తాను” అని అన్నారు. “భారతదేశంలో అన్ని రకాల అసమానతలు ఉన్నాయి . కేవలం భారీ ఆర్థిక అసమానతలే కాదు, కుల వ్యవస్థ, తీవ్రమైన లింగ వివక్ష, విద్యతో పాటు భారీ వ్యత్యాసాలు, ఇంకా మరెన్నో ఉన్నాయి” అని డ్రీజ్ అన్నారు. “ఒక ఆశాకిరణం ఏమిటంటే, అసమానతలను ప్రతిఘటించిన గొప్ప చరిత్ర కూడా భారతదేశానికి ఉంది.
ఈ ఉద్యమాలలో కొన్నింటితో సంబంధం కలిగి ఉండటం నా అదృష్టం” అని ఆయన తెలిపారు. ప్రపంచ అస మానతల అవగాహనకు గణనీయమైన కృషి చేసిన పరిశోధకులకు ప్రతి రెండేండ్లకు ఒకసారి గ్లోబల్ ఇనీక్వాలిటీ రీసెర్చ్ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డు యొక్క రెండవ ఎడిషన్. 2024లో ప్రారంభమైన గ్లోబల్ ఇనీక్వాలిటీ రీసెర్చ్ అవార్డును, సామాజిక , పర్యావరణ అసమానతలపై చేసిన కృషికి గాను బీనా అగర్వాల్, జేమ్స్ కె బాయ్స్‌లకు సంయుక్తంగా ప్రదానం చేశారు. ఇటీవలి సంవత్సరాలలో, డ్రీజ్ ఉపాధిహామీ చట్టం రద్దును వ్యతిరేకించారు . ఆహార రేషన్ల కోసం ఆధార్ ప్రామాణీకరణను ప్రశ్నించారు. కొత్త గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) యాక్ట్’, “ఆ హామీ వర్తిస్తుందనే హామీ లేకుండానే పనికి హామీ ఇస్తుంది” అని ఆయన వాదించారు. ఆధార్ ప్రామాణీకరణ లేకపోవడం వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పౌరులకు ఆహార రేషన్లను నిరాకరించడాన్ని కూడా డ్రీజ్ ప్రశ్నించారు.
ఆర్థికవేత్త జీన్ డ్రీజ్‌కు అంతర్జాతీయ పురస్కారం
- Advertisement -
- Advertisement -



