Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
నిరుపేద కుటుంబాల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో గ్రామస్థులు, నాయకులు, అధికారులు పాల్గొని కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న గృహ సదుపాయం ఎంతో ఉపయోగకరమని, ఇలాంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, ఓబీసీ మండల అధ్యక్షుడు తిరుమల స్వామి, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాద గౌడ్, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, పంచాయితీ కార్యదర్శి సుమేధా రెడ్డి, మాజీ సర్పంచ్ రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -