Thursday, February 12, 2026
E-PAPER
Homeకరీంనగర్పోలింగ్ శాతాలపై సర్వత్రా చర్చ

పోలింగ్ శాతాలపై సర్వత్రా చర్చ

- Advertisement -

గెలుపోటములపై అభ్యర్థుల సమాలోచనలు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
పుర ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది అభ్యర్థులు తమకు వచ్చే ఓట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. సిరిసిల్ల వేములవాడ రెండు పట్టణాల్లో పోటీలో నిలిచిన అభ్యర్థుల పోలింగ్ కేంద్రాల వారిగా నివేదికలు తీసుకున్నారు. వార్డులో పోటీ ఆధారంగా పోలైన ఓట్లతో పోల్చుకుంటూ ఫలితాలపై అంచనా వేసుకుంటున్నారు. అభ్యర్థులు బయటకు హుందాగా కనిపిస్తున్న లోలోపల గుబులుతో ఒత్తిడికి గురవుతున్నారు తమ అనుయాయులతో వార్డుల్లో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనీ తెలుసుకుంటున్నారు. ఈనెల 13 న లెక్కింపు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల విజయం సాధించాలని వారి కుటుంబ సభ్యులు ఆలయాలను సందర్శించడం పూజలు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

జిల్లాలో రెండు పురపాలికల్లో 67 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఓటర్లు ఓటు వినియోగంలో చైతన్యవంతులయ్యారు. సిరిసిల్ల వేములవాడ రెండు పట్టణాల్లో 122836 మంది ఓటర్లకు 95443 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.77.70% మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 27393 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. ఇందులో ఎక్కువ భాగం ఏ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని విశ్లేషిస్తున్నారు పోలింగ్ శాతాన్ని అనుసరించి అభ్యర్థుల విజయ అవకాశాలు ఆధారపడి ఉండనున్నాయి. 2020 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది.*ఫలితాలపై ఉత్కంఠ…పురపోరు ఫలితాలు వెలువడేందుకు కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి.

ప్రాల్లో బాల పర్వం జోరుగానే సాగింది దీంతో ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి కలిసొస్తుంది? ఓటర్లు ఎటు మొగ్గు చూపారు అనేది ఫలితాల వరకు ఉత్కంఠ గానే ఉంటుంది మరోవైపు పార్టీలపరంగా ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయనే లెక్కలు వేస్తున్నారు అభివృద్ధి సంక్షేమం బాగా పనిచేస్తుందని అధికార పార్టీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు. వీటిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బి ఆర్ ఎస్, బిజెపి లో పంచుకోవడం వల్ల తమకు పెద్దగా నష్టం జరగదనుకుంటున్నారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన వారు రెండు చోట్ల పెద్ద ఎత్తున స్వతంత్రులుగా బరిలో నిలిచారు.

వీరికి ఆయా వార్డుల్లో అనుకూలంగా ఉన్న గెలిచాక వారు ఏ పార్టీలోకి వెళ్తాను అని ప్రజలు చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు పురపాలక సంఘాల్లో జనరల్ మహిళ, బీసీ మహిళ కు కేటాయించారు. వార్డుల్లో ఈ రిజర్వు స్థానాల్లో గెలుపొందే అభ్యర్థులపైనే రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది ఏ రాజకీయ పార్టీ పుర పీఠాల అభ్యర్థులను ముందుగా ప్రకటించలేదు. సిరిసిల్ల, వేములవాడ రెండు పార్టీలు పోటాపోటీగా కనిపిస్తున్నాయి. చైర్మన్ స్థానాల్లోని పోటీ ఎక్కువగా ఉన్న పక్షంలో ఉపాధ్యక్షులు ఇతర పదవులు ఇచ్చేందుకు నేతలు సమాలోచన చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -