Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెరిగిన ధరలతో సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం

పెరిగిన ధరలతో సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం

- Advertisement -

మాజీ ఎంపీటీసీ పిక్క శ్రీనివాస్ 
నవతెలంగాణ – ఆలేరు రూరల్

కేంద్ర ప్రభుత్వం డీజిల్,పెట్రోల్,వంటగ్యాస్, ఎరువులు,నిత్యావసర వస్తువుల ధరలను వరుసగా పెంచుతూ సామాన్య ప్రజల నడ్డివిరుస్తోందని పటేల్‌గూడెం మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిక్క శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం నవతెలంగాణ విలేకరితో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ధరల కారణంగా పేద,మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధరల పెంపు విధానాల వల్ల రైతులు,వ్యవసాయ కార్మికులు,ఉద్యోగులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి,దాని ప్రభావం అన్ని నిత్యావసర వస్తువుల ధరలపై పడుతోందని అన్నారు.

దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై మరింత భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం,అదే ప్రజలపై ధరల భారాన్ని మోపడం దురదృష్టకరమని విమర్శించారు.ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ సామాన్యుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ధరల పెరుగుదలతో గృహిణులపై అదనపు భారం పడుతోందని,కుటుంబాల నెలవారీ బడ్జెట్ పూర్తిగా దెబ్బతింటోందని అన్నారు.రైతులకు అవసరమైన ఎరువులు,ఇంధనం ధరలు పెరగడంతో సాగు వ్యయాలు అధికమై వ్యవసాయం మరింత భారంగా మారిందని పేర్కొన్నారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్,వంటగ్యాస్,ఎరువుల ధరలను వెంటనే తగ్గించి పేద,బడుగు,బలహీన వర్గాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజల ఇబ్బందులను గుర్తించి ధరల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని,లేకపోతే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -