నవతెలంగాణ-హైదరాబాద్: రేపు నీతిఅయోగ్ 11వ పాలకమండలి సమావేశం జరగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పౌర సమగ్ర శ్రేయస్సు, పార్రిశామికతతోపాటు ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు నీతి అయోగ్ ప్రకటన విడుదల చేసింది.
కాగా, ఈ ఏడాది థీమ్ ‘వికసిత్ భారత్ @2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి’. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక-ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుని శ్రేయస్సు, అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది అని నీతి అయోగ్ ప్రకటన పేర్కొంది. దేశవ్యాప్తంగా పారిశ్రామికతను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన చర్యలపై ప్రధాని మోడీ ఈ సమావేశంలో చర్చించనున్నారు అని ఈ ప్రకటన పేర్కొంది.



