Wednesday, June 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా: సర్పంచ్

గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిలో భాగంగా బుధవారం మోగా గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ హాలే బస్వంత్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. నాకు ఇతర ఏ ఆశలు లేవని అన్నారు. డబ్బు సంపాదించాలనే కోరికతో సర్పంచ్ గా పోటీ చేయలేదని తెలిపారు. సర్పంచ్ గా గెలిపించిన గ్రామస్థులకు రుణపడి ఉంటానని అన్నారు. గ్రామంలోని ఎలాంటి సమస్యల పరిష్కారానికైనా ప్రజలు గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడితే సమస్య పరిష్కారం కాదని అన్నారు. కార్యదర్శికి గానీ, నాకు గానీ రాతపూర్వకంగా సమస్యను తెలపాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రతి సమస్య పరిష్కారానికి శిక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. అనంతరం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో అధికారులు, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -