ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మక్కెర ప్రకాష్ బాబు ఔ
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు ఉన్నాయని అందులోనే నాణ్యమైన విద్య అందుతుందని ఆ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మక్కెర ప్రకాష్ బాబు తెలిపారు. బుధవారం రాజుల కొత్తపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచార నిర్వహించి అడ్మిషన్లు పొందాలనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని ఈ విద్యా సంవత్సరం నుండి అల్పాహారం మధ్యాహ్నం భోజనం కూడా విద్యార్థులకు కల్పిస్తున్నదని అన్నారు. ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు స్కాలర్షిప్ విశాలమైన తరగతి గదులు ఎన్ఎస్ఎస్ యూనిట్స్ లైబ్రరీ విశాలమైన తరగతి గదులు అధునాతనమైన ల్యాబులు ఉన్నాయని చెప్పారు. విద్యార్థులకు విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో వసతులను కల్పించిందని అందుకోసం ప్రతి ఒక్క పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థి ఇంటర్ మీడియట్ చదివేందుకు మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యా అని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ తెలిపారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు కందికొండ బాబు కవిరాజు సుభాష్ మహేందర్లు పాల్గొన్నారు.



