ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది. మొదటి విడతగా విడుదల చేసిన రూ. 259.36 కోట్లతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.646.36 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అందింనట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేసి, కేంద్ర ప్రభుత్వం కోరిన అన్ని విధాల సమాచారం, నిధుల వినియోగ వివరాలను సమర్పించిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఈ నిధులు విడుదలైనట్టు అధికారులు తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, గ్రామీణ రహదారుల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు.
పెండింగ్ నిధులను విడుదల చేయాలి: మంత్రి సీతక్క
రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం కింద రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రూ.3,000 కోట్ల వరకు తెలంగాణకు రావాల్సి ఉండగా, ఇప్పటికీ రూ.646.36 కోట్లు విడుదల చేశారని అన్నారు. ఇంకా రూ.2,400 కోట్ల వరకు నిధులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. వాటిని ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి వెంటనే విడుదల చేయాలని కోరారు.
జీపీలకు రెండో విడత రూ. 387 కోట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



