– ఈనెల 20న జాతీయ మెగా లోక్ అదాలత్
– సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీదేవి
నవతెలంగాణ-ఆర్మూర్
ఈనెల 20న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా ఆర్మూర్ మండల్ లీగల్ సర్వీస్ చైర్ పర్సన్, సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీదేవి అధ్యక్షతన కోఆర్డినేషన్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి సరళ రాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్యశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ.. లోక్ అదాలత్ లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ నిర్వహణకు సంబంధించిన కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చిన్నచిన్న పెట్టి కేసులు తదితర రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం లోక్ అదాలత్ ద్వారా కల్పించబడుతుందని తెలిపారు.రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా రాజీ కుదిరేలా అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుదురుపాక ప్రవీణ్ చందర్, పట్టణ సీఐ సత్యనారాయణ గౌడ్,రూరల్ సీఐ జాన్ రెడ్డి, భీమ్గల్ సీఐ సత్యనారాయణ, వివిధ పోలీస్ స్టేషన్ ల ఎస్ఐ లు, కోర్ట్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజీ మార్గమే రాజమార్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



