- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ
మండల కేంద్రంలో గురువారం గ్రామ సర్పంచ్ గాండ్ల రాజేష్ ఆధ్వర్యంలో రెండు మహిళా సంఘ భవనాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సంఘ భవనాల నిర్మాణం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ ఏఈ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మోహన్, ఉప సర్పంచ్ గాండ్ల రాజేందర్, పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



