Friday, June 12, 2026
E-PAPER
Homeజాతీయంచేతులెత్తేసిన మోడీ సర్కార్

చేతులెత్తేసిన మోడీ సర్కార్

- Advertisement -

కనిపించని ఐదు ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థ
టార్గెట్‌ 2022 పోయింది..
2025 గడువు కూడా దాటింది
అయినా నెరవేరని
కేంద్రం లక్ష్యం
12 ఏండ్ల పాలనలో
ఆర్థిక వృద్ధి గణనీయంగా
పడిపోయిన వైనం
ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థికవిధానాలపై
వెల్లువెత్తుతున్న విమర్శలు

న్యూఢిల్లీ : భారత్‌‌ను ఐదు ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోడీ ప్రతి వేదిక పైనా చెప్తూ ఉండేవారు. 2018లో ప్రధాని ప్రకటించిన ఈ లక్ష్యం మరోసారి గడువు దాటింది. మొదట 2022 నాటికి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పిన కేంద్రం.. ఆ తర్వాత దానిని 2024-25 ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేసింది. అయితే తాజాగా విడుదలైన 2025-26 జీడీపీ గణాంకాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 3.6 ట్రిలియన్‌ ‌డాలర్ల వద్దే ఆగిపోయింది. దీంతో ఎంతో ఘనంగా ప్రకటించిన మోడీ సర్కారు ఐదు ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థ హామీ రెండో సారి కూడా ఇప్పుడు ‘విజన్‌ 2047’ అంటూ కొత్త రాగం ఇక ఆర్థిక వ్యవస్థ వృద్ధిని కేవలం రూపాయల్లో కొలవడం వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం, దేశీయ వినియోగం కారణంగా జీడీపీ పెరిగినట్టు కనిపించినా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక దేశ స్థానం, కొనుగోలు శక్తి, అంతర్జాతీయ ప్రభావం వంటి అంశాలు డాలర్ విలువ ఆధారంగానే నిర్ణయించబడతాయని అంటున్నారు. గతంలో ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని మోడీ సర్కారు ఆర్థిక విధానాల కేంద్రబిందువుగా ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు ఆ లక్ష్యం గురించి మాట్లాడకుండా ‘2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్’ అనే దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి మళ్లిస్తోంది.

ఇప్పటికే రెండుసార్లు గడువు దాటిన ‘ఐదు ట్రిలియన్ డాలర్ల’ హామీపై సమాధానం చెప్పకుండా.. మరింత దూర భవిష్యత్తు లక్ష్యాలను ప్రస్తావించడం ద్వారా మోడీ సర్కారు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఇది మోడీ సర్కారు ఆర్థిక వైఫల్యానికి ఒక ప్రత్యక్ష‍ ఉదాహరణగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.​ ​2018లో లక్ష్యం ప్రకటన.. 3.6 ట్రిలియన్‌ ‌డాలర్ల వద్ద నిలిచిన వైనం 2018 సెప్టెంబర్ 20న ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఆ సమయంలో 2022ను గడువుగా నిర్ణయించారు. అయితే ఆ గడువు ముగిసినా లక్ష్యం మాత్రం నెరవేరలేదు. అనంతరం కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి మార్చింది. ఇప్పుడు విడుదలైన తాజా జీడీపీ గణాంకాలు కూడా ప్రభుత్వ అంచనాలను తప్పని నిరూపించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ రూ.346.4 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది డాలర్లలో సుమారు 3.6 ట్రిలియన్లకు సమానం. అంటే మోడీ సర్కారు ప్రకటించిన లక్ష్యానికి ఇంకా చాలా దూరంలోనే భారత్ నిలిచిపోయింది. ​​

లక్ష్యాన్ని పక్కకుబెట్టిన మోడీ సర్కారు ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని ప్రతి వేదిక పైనా ప్రస్తావించిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. గత కొన్నేండ్లుగా ప్రభుత్వ ఆర్థిక ప్రచారంలో ప్రధాన నినాదంగా నిలిచిన ఈ లక్ష్యం ఇప్పుడు అధికారిక ప్రసంగాల్లో కనిపించడం లేదు. దీంతో స్వయంగా తామే నిర్దేశించుకున్న ఈ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యామనీ, దానిని సాధించే అవకాశమూ లేదని మోడీ సర్కారే అంగీకరించినట్టు అర్థమవుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. ​ఆరో స్థానానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థ ఇక భారత్ త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోడీ ప్రభుత్వం తరచూ ప్రకటించింది. ప్రభుత్వ వర్గాల నుంచి కూడా ఇప్పటికే ఆ స్థానానికి చేరుకున్నామనే ప్రకటనలూ వచ్చాయి. కానీ తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానే కొనసాగుతోంది. భారత స్టాక్ మార్కెట్ కూడా ఇటీవల ప్రపంచంలో ఆరో స్థానానికి పడిపోయింది. దీంతో ప్రపంచ ఆర్థిక శక్తుల అగ్రశ్రేణిలోకి భారత్ వేగంగా చేరుకుంటుందన్న ప్రభుత్వ వాదనలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.​

​మోడీ పాలనలో తగ్గిన ఆర్థిక వృద్ధి : ఆర్థికవేత్తలు
ఆర్థికవేత్తల గణాంకాల ప్రకారం… 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యూపీఏ పాలనలో భారత జీడీపీ డాలర్ విలువలో సమ్మిళిత వార్షిక సగటు వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 11 శాతానికి పైగా నమోదైంది. కానీ మోడీ ప్రభుత్వం 12 ఏండ్ల పాలనలో అదే వృద్ధి రేటు సుమారు 6 శాతానికే పరిమితమైంది. అంటే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం గణనీయంగా తగ్గింది. డాలర్ పరంగా వృద్ధి మందగించడానికి ప్రధాన కారణాల్లో రూపాయి విలువ క్షీణత ఒకటి. కేంద్రంలోని మోడీ పాలనలో గత దశాబ్ద కాలంలో రూపాయి నిరంతరం బలహీనపడటంతో భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో ఆశించినంతగా పెరగలేకపోయిందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ​

​కేంద్రం విధాన వైఫల్యాలు
దేశ ఆర్థిక వ్యవస్థ ఆశించిన లక్ష్యాలను సాధించకపోవడానికి కేంద్రంలోని మోడీ సర్కారు వైఫల్యమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడంలో కేంద్రం విఫలమైంది. దేశ ఎగుమతులను గణనీయంగా పెంచే విధానాలు తీసుకురాలేకపోయింది. కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో తగిన పెట్టుబడులు పెట్టలేదు. దిగుమతి ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించలేకపోయింది.ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం అందని ద్రాక్షగా మారిందని ఆర్థిక విశ్లేషకులు వివరిస్తున్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -