రెండు నాల్కల ధోరణితో ప్రభుత్వం
యజమాన్యాల ఒత్తిడే కారణమంటూ
కార్మిక సంఘాల విమర్శ
రూల్స్ ఫ్రేమ్‌పై కార్మిక శాఖ తలమునకలు
ఆందోళనలో కార్మికులు
‘ నాలుగు లేబర్ కోడ్ ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.ఆ ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా కొనసాగుతుంది. అవసరమైన చర్యలు పూర్తయ్యాక వాటిని త్వరలోనే అమలుకు పూనుకుంటాం.`ఈ నెల 8న కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక శాఖ మంత్రుల వర్చువల్ సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇది.కార్మికుల ప్రయోజనాల రీత్యా ఈ కోడ్ లను అమలు చేయబోమంటూ టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పలు సందర్భాల్లో సెలవిచ్చారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఇద్దరు కీలక నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి వారు చెప్పిన మాటల్లో కార్మికులు దేనిని నమ్మాలి? రాష్ట్రంలో ఆ కోడ్ లు అమలు చేస్తారా? నాటి కేరళ సర్కారు లాగా తిరస్కరిస్తారా? అంటే..రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఆ కోడ్ ల అమలుకు కసరత్తు చేస్తున్నదని చెప్పక తప్పదు. అందుకు తగ్గట్టుగానే చాపకింది నీరులాగా అది పావులు కదుపుతున్నది. కోడ్‌ల అమలుకు రూల్స్ ను తయారు చేసింది. తూతూ మంత్రంగా కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నది. అభ్యంతరా లుంటే..రాత పూర్వకంగా ఇవ్వాలని ఆ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకుంటారనే గ్యారెంటీ లేదు. ఎన్నో పోరాటల ఫలితంగా వచ్చిన కార్మిక హక్కులను కాలరాసే ఆ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు, కార్మికులు అడుగుతుంటే..సవరణలకు సూచనలు అడగటమేంటనే ప్రశ్నలు కార్మికుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.
కోడ్ లపై దొంగాట…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయబోమంటూ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చెబుతోంది. ఇదే అంశంపై ఆ పార్టీ పార్ల మెంట్ ముందు నిరసనలకు దిగింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
యజమాన్యాల ఒత్తిడే కారణమా?
అయితే రాష్ట్రంలో నాలుగు లేబర్ కోడ్ లను త్వరగా అమల్లోకి తేవాలంటూ ప్రభుత్వంపై, కార్మిక శాఖపై పారిశ్రామి వేత్తలు ఒత్తిడి పెడుతున్నట్టు తెలుస్తోంది. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్వయంగా పారిశ్రామికవేత్త కావటం వల్ల ఇది పారిశ్రామికవేత్తలకు కలిసొచ్చే అంశంగా ఉంది. లేబర్ కోడ్ ల అమలు కోసం విధి విధానాలను రూపొందించే ముందు కార్మిక సంఘాలను సమావేశ పర్చాలి. అసెంబ్లీలో చర్చకు పెట్టాలి. కేరళ ప్రభుత్వం గతంలో పాటించిన పద్దతిని అనుసరించాలి. కానీ..అవేమీ చేయకుండా ఎకాఎకిన రూల్స్ ను రూపొందించటం, అభిప్రాయాలు, ఆ పైన ఆమోదం అనే విధంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కార్మికులకు కష్టాలే…
రాష్ట్రంలో లేబర్ కోడ్ లు అమలైతే.. కార్మికులకు కష్టాలు తప్పవు. నిరసన తెలిపే హక్కు, వేతనాలకోసం కొట్లాడే హక్కు పోతుంది. పని భద్రత ఉండదు. ప్రశ్నించే హక్కు హరించబడుతుంది. సమ్మె చేసే హక్కు పూర్తిగా కోల్పోతారు. రాష్ట్ర విభజన నుంచి తొమ్మిదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లయింది. అధికారంలో ఎవరు ఉన్నా యజమాన్యాలకు అనుకూల విధానాలను రూపొందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కార్మిక శాఖ వ్యవహరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కార్మిక శాఖ యజమానుల శాఖగా మారుతున్నది. తనిఖీల కోసం ఉండాల్సినంత సిబ్బంది లేదు. అరకొర సిబ్బందితో ఆ శాఖ నెట్టకొస్తున్నది.
చోద్యం చూస్తున్న మంత్రి, అధికారులు ..
రాష్ట్రంలో కార్మికులు పలు పరిశ్రమల్లో వేతనాల పెంపుకోసం, మెరుగైన సౌకర్యాల కోసం సమ్మెలు చేశారు. చేస్తున్నారు. కానీ..కార్మిక శాఖ అధికారులు, సంబంధిత మంత్రి జోక్యం చేసుకున్న పాపాన పోలే, పైగా చోద్యం చూస్తున్నారు.జోక్యం చేసుకుంటే..చట్టాలు అమలు చేయాలి. యజమానులకు నష్టం వస్తుంది. కాబట్టి మొఖం చాటేస్తున్నారు.తనిఖీల మాటే లేదు. సిగాచీ లాంటి పరిశ్రమల్లో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. లేబర్ కోడ్ ల అమలుతో తనిఖీల వ్యవస్థ చట్టబద్దంగానే రద్దవుతుంది. దాంతో యజమాన్యాలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారనుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో కార్మిక కోడ్ లు అమలు చేస్తే ఉద్యమమే..
పాలడుగు భాస్కర్ ప్రధాన కార్యదర్శి సీఐటీయూ
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు అమలు చేయబోమంటూ కార్మికులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి. అప్పుడే ఈ ప్రభుత్వాన్ని కార్మికులు నమ్ముతారు. అక్కడోక మాట ఇక్కడోక మాట మాట్లాడితే.. నమ్మటానికి కార్మికులు అమాయకులు కాదు..వారిని మోసం చేసేవారు కార్మిక ద్రోహులుగా మిగిలి పోతారు. కార్మిక శాఖ కూడా చట్టబద్దంగా వ్యవహరించాలి. యజమాన్యాలకు తోడ్పడే శాఖగా మారితే కుదరదు. రాష్ట్రంలోని లక్షల మంది కార్మికులు ప్రభుత్వ ద్వంద వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అంటే మాటల్లో కాదు..చేతల్లో చూపించాలి. లేదంటే..ఐక్య కార్మికోద్యమాలు తప్పవు. కేసీ వేణుగోపాల్ ఏకంగా ఒక లేఖనే విడుదల చేశారు. అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ లేబర్ కోడ్ లను రాష్ట్రంలో అమలు చేయబోమంటూ బయటికి చెబుతూ..లోపల మాత్రం వాటి అమలుకు పావులు కదుపుతోంది. కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ రెండు నాల్కల ధోరణిని కార్మికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇది కచ్చింతంగా మోసమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
.
కసరత్తులు ముమ్మరం…
సర్కారు ఆదేశాలతో కార్మిక శాఖ కోడ్ ల అమలుకు కసరత్తులు ముమ్మరం చేసింది. అయితే ఈ ప్రక్రియలో కార్మిక శాఖ అనుసరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తున్నది. కనీస నిబంధనలను పాటించటం లేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలకు నిబంధన ప్రకారం ఆహ్వానాలు పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని లక్షలాధి మంది కార్మికుల భవితవ్యానికి సంబంధించిన విషయాన్ని కార్మిక శాఖ లైటుగా తీసుకోవద్దని హితవు పలుకుతున్నాయి. పారిశ్రామిక వేత్తల లాభాల కోసం కార్మికుల హక్కులకు మంగళం పాడొద్దని వేడుకుంటున్నాయి.
హక్కుల హననం..అందుకే రద్దు. .
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించకుండా నాలుగు లేబర్ కోడ్ లు తీసుకొచ్చింది. యజమానుల లాభాలకోసం తెచ్చిన ఆ లేబర్ కోడ్ లు , కార్మిక హక్కులను హననం చేశాయి. వాటిని రద్దు చేయాన్పించేదని కాంగ్రెస్, ఐన్టీయూసీతోపాటు రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు మోడీ ప్రభుత్వ చర్యను నిరసించాయి. సమ్మెలు నిర్వహించాయి. హైదరాబాద్ లో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆ సంఘం నేతలతోపాటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా జరిగిన సభలో లేబర్ కోడ్ ల వల్ల కార్మిక హక్కులకు జరుగుతున్న విఘాతంపై ఆయన విమర్శనాస్ర్తాలను సంధించారు. మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయబోమంటూ భరోసా ఇచ్చారు. కార్మికులు ఆయన వాగ్దానాన్ని మర్చిపోలేదు..అయినా ప్రభుత్వం మొండిగా వ్యహరిస్తున్నది.



