Friday, June 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గోకనకొండ గ్రామానికి చెందిన కొండి ఆంజనేయులు, చెడు వ్యసనాలకు బానిసై తరచూ భార్య సుబ్బులును వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు మంటలు ఆర్పివేసి, ఆమెను వినుకొండ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -