మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ విజయంతో ప్రజాపాలనకు ప్రజామోదం లభించిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సన్న బియ్యం పంపిణీ ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారిందని చెప్పారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, అమలౌతున్న సంక్షేమ పథకాలకే ఈ విజయానికి కారణమని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు తెల్లరేషన్ కార్డుల పంపిణీతోపాటు రాష్ట్ర జనాభాలో 85శాతం ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ ప్రతిష్టాత్మక కార్యక్రమాలతోపాటు ఆరుగ్యారంటీలను అమలు చేయడాన్ని ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. పల్లెలతోపాటు పట్టణాలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలిచ్చిన తీర్పుగా ఆయన అభివర్ణించారు.
ప్రభుత్వ పనితీరుకు పట్టం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు పట్టణ ప్రాంతాల ప్రజలు పట్టం కట్టారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 90పైగా మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసినా కాంగ్రెస్‌కు దరిదాపుల్లోకి రాలేదని చెప్పారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందంటూ ఆ పార్టీలు చేసిన ఆరోపణలను రామగుండం ప్రజలు పట్టించుకోలేదని విమర్శించారు.
పొగరు బోతు మాటలకు గుణపాఠం : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్
మాజీ మంత్రి కేటీఆర్ పొగరుబోతు మాటలకు ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రజా పాలనకు ప్రజలు పట్టం కట్టారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి శిఖండి రాజకీయాలకు పాల్పడినా ప్రజలు తెలివిగా ఆ పార్టీలకు బుద్ధి చెప్పారని ఆయన తెలిపారు.
ప్రజాపాలనకు ప్రజామోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



