నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే.ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం నామినేషన్ తిరస్కరణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఆమె వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో అలాంటి తీర్పులు ఏమైనా ఉంటే కోర్టు ముందు పెట్టాలని సూచించింది. తాజగా సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత జాతీయ మీడియాతో మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. కేంద్ర ఎన్నిలక ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈసీ నిజస్వరూపం మరోసారి బయటపడిందని విమర్శించారు.
“ఎన్నికల సంఘం వైఖరి ఏమిటో మనందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టుకు సంబంధించి నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలుచుకోలేదు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని తాను మొదటి రోజు నుంచీ చెబుతూనే ఉన్నాను, ఈ రోజు అది మరోసారి రుజువైంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర తరఫు న్యాయవాది వాదనలు వినిపించినప్పుడు, అది కేవలం ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. మేము రాష్ట్రాలకు వ్యతిరేకంగా పోరాడలేదు; మేము ఎన్నికల సంఘం గురించి ప్రస్తావించాము. రిటర్నింగ్ అధికారి ఏ విధంగా పక్షపాతంతో వ్యవహరించారో మేము ఎత్తిచూపాము, ఇప్పుడు వారి నిజస్వరూపం ప్రజల ముందు బయటపడింది.’ అని ఆమె పేర్కొన్నారు.



