Friday, June 12, 2026
E-PAPER
Homeజాతీయంసుప్రీంకోర్టులో న‌ట‌రాజ‌న్‌కు ఎదురుదెబ్బ‌

సుప్రీంకోర్టులో న‌ట‌రాజ‌న్‌కు ఎదురుదెబ్బ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నామినేష‌న్‌ను తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే.ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. తాజాగా విచార‌ణ చేప‌ట్టిన జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌.చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఆమె వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.నామినేషన్‌ తిరస్కరణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. గతంలో అలాంటి తీర్పులు ఏమైనా ఉంటే కోర్టు ముందు పెట్టాలని సూచించింది. రిటర్నింగ్‌ అధికారి ఒకసారి అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరిస్తే.. దానిపై ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించడమే సరైన మార్గమని పేర్కొంది. ఈ పిటిషన్‌ విచారణకు అర్హత లేదంటూ దాన్ని కొట్టివేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -