నవతెలంగాణ – మునిపల్లి
ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతుందని మేళా సంఘం గ్రామ సర్పంచ్ కుప్నాగారం లక్ష్మీ సంగమేశ్వర్ పేర్కొన్నారు. గ్రామానికి చెందిన కవిలే స్వప్న- నర్సింలు కుమార్తె మహేశ్వరి ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సందర్భంగా స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
నిరుపేద కుటుంబానికి చెందినప్పటికీ పట్టుదల స్ఫూర్తితో మహేశ్వరి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మార్కులు సాధించి గ్రామానికి ఆదర్శంగా నిలిచిందని ఆమె కొనియాడారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలు బలోపితంగా ఉన్నాయనడానికి మహేశ్వరి సాధించిన విజయమే ఉదాహరణగా చెప్పుకోవచ్చని ఆమె ప్రభుత్వ పాఠశాలల పనితీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అంజయ్య మాజీ ఉపసర్పంచ్ కుప్నాగారం సంగమేశ్వర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శశికళ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యారాలు సునీత ఉపాధ్యాయులు భానుప్రకాష్, వీరన్న, శ్రీకాంత్ గ్రామ పెద్దలు పడమటి సంగన్న ఖ్యాతం రవీందర్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



