Friday, June 12, 2026
E-PAPER
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో  నారా ముత్తమ్మ (75) అనే మానసిక వృద్ధురాలు మృతిచెందిన సంఘటన పెద్దతూoడ్లలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల,కొయ్యుర్ పోలీసుల పూర్తి కథనం ప్రకారం మృతురాలు కొన్ని సంవత్సరాలుగా మానసిక స్థితి సరిగ్గా లేక కొయ్యూరు గ్రామం నందు బిక్షాటన చేస్తూ జీవిస్తుంది. గురువారం రాత్రి 11 గంటలకు కోయ్యూర్ పాత పెట్రోల్ బంక్ ఎదురుగా ఏదో గుర్తు తెలియని వాహనం ఆమెను డీ కొట్టగా అక్కడికక్కడే చనిపోయిందని తెలిపారు. మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నట్లుగా కొయ్యూరు ఎస్ఐ మహేందర్ కుమార్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -