Wednesday, August 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాల స్వర్ణకార సంఘానికి నూతన కార్యవర్గం

పరకాల స్వర్ణకార సంఘానికి నూతన కార్యవర్గం

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల పట్టణ స్వర్ణకార సంఘం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులను బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బెజ్జంకి పూర్ణాచారి, ప్రధాన కార్యదర్శిగా మారుపాక విజయ్, కోశాధికారిగా వంగల రమేష్ ఎన్నికయ్యారు. హనుమకొండ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు, పరకాల పట్టణ స్వర్ణకార సంఘం నాయకుల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం సంఘం అభివృద్ధికి, స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -