- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ట్రాక్టర్ల, జేసిబి యజమానులకు గ్రామ సర్పంచ్ బండి స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడ్డెర పల్లె తాళ్లు, మానేరు వాగుల నుండి గ్యాస్ పైప్ లైన్ పోయినందున ఆ పైపులైన్ మీద కానీ దాని దగ్గర పరిసర ప్రాంతాలల్లో గాని ఏలాంటి ఇసుక, మట్టి రవాణా చేయడం, తవ్వడం చేయరాదని చెప్పారు. ఇసుక మట్టి తీసినచో పైపులైను డ్యామేజై నష్టమే కాకుండా ప్రమాదం సంభవిస్తోందన్నారు. కావున ట్రాక్టర్ల, యజమానులు, డ్రైవర్స్, జెసిబి యజమానులు, అపరేటర్లు గమనించాలన్నారు.
- Advertisement -



