Friday, June 12, 2026
E-PAPER
Homeఖమ్మంఅపరాల సాగుతో పంట మార్పిడి, భూసారం పెరుగుదల

అపరాల సాగుతో పంట మార్పిడి, భూసారం పెరుగుదల

- Advertisement -

– రైతులకు 50 శాతం రాయితీపై విత్తనాలు
– ఏడీఏ పెంటేల రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట

అపరాల సాగు ద్వారా పంట మార్పిడి సాధ్యమై భూసారం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పెంటేల రవికుమార్ తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ (అపరాల సాగులో ఆత్మనిర్భరత మిషన్) ద్వారా రైతులను అపరాల సాగు వైపు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం నవతెలంగాణతో మాట్లాడుతూ పథకం లక్ష్యాలు, రైతులకు అందించే ప్రోత్సాహకాలపై వివరాలు వెల్లడించారు.

ఈ పథకం ప్రధాన లక్ష్యాలు: అపరాల సాగు విస్తీర్ణాన్ని పెంచడం, దిగుబడులను మెరుగుపరచడం ద్వారా దేశాన్ని అపరాల ఉత్పత్తిలో స్వావలంబన దిశగా తీసుకెళ్లడమేనని తెలిపారు. అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్‌లో ప్రస్తుత వానాకాలంలో కంది, మినుము సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. రైతులు పంట మార్పిడి పద్ధతిని అనుసరించేలా కంది, మినుము సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కంది పంటలో ఎకరానికి 10 క్వింటాళ్లు, మినుములో 7.78 క్వింటాళ్ల దిగుబడి సాధించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

కంది పంటను ఏక పంటగా లేదా పత్తిలో అంతర పంటగా సాగు చేయవచ్చని తెలిపారు. అధిక విస్తీర్ణం లో సాగులో ఉన్న పత్తి పంటలో అంతర పంటగా కంది వేసే ఆనవాయితీ ఉండేది. ప్రస్తుతం రైతులు వారి ఇంటి అవసరాలకు సరిపడా కంది సాగు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు, పత్తి రైతులు ప్రతి 4-6వరుసలకు ఒక సాలు కంది వేయటం ఎంతో ఉత్తమ పద్దతి. ప్రస్తుతం అశ్వారావుపేట మండలంలో సుమారు 1,800 ఎకరాల్లో మినుము సాగు జరుగుతోందన్నారు. అపరాల సాగు వల్ల పంట మార్పిడి జరిగి భూమిలో నత్రజని నిల్వలు పెరగడంతో భూసారం మెరుగుపడుతుందని వివరించారు. 

ఆత్మనిర్భరత మిషన్ కింద రైతులకు విత్తనాలను 50 శాతం రాయితీపై అందిస్తున్నామని తెలిపారు. విత్తనాలు విత్తిన దశ నుంచి పంట కోత వరకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సాంకేతిక సూచనలు, సలహాలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తారని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అపరాల సాగును విస్తరించాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -