నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 62 వ స్థాపన దినోత్సవ వేడుకలను శుక్రవారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల అసోసియేట్ డీన్(ఇంచార్జి) డాక్టర్ ఐ.వి. శ్రీనివాస రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సాంకేతికత, పరిశోధన, రైతు సంక్షేమం కోసం విశ్వవిద్యాలయం చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వివిధ పంట రకాలు, వాటి ప్రయోజనాల గురించి తెలియజేశారు. అలాగే ఉద్యానవన పంటల ప్రాధాన్యత, రైతులకు అవి అందించే ఆర్థిక లాభాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొని వ్యవసాయ రంగంలో విశ్వవిద్యాలయం సాధించిన విశిష్ట విజయాలను స్మరించుకున్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డా. పి. ఝాన్సీ రాణి, డాక్టర్ శ్రీ జన్, స్రవంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రామ్ ప్రసాద్, జంబమ్మ, కృష్ణ తేజ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



