- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్ నాలాపై కొత్త వంతెన ఏర్పాటు సందర్భంగా ఈనెల 13 నుంచి 15 వరకు ఆయా ప్రాంతాల్లో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని నగర జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. హిమాయత్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరాపార్కు వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తామన్నారు. ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు.
- Advertisement -



