Saturday, August 15, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ రీఎగ్జామ్‌కు పారామిలిటరీ బలగాలతో భద్రత

నీట్ రీఎగ్జామ్‌కు పారామిలిటరీ బలగాలతో భద్రత

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నీట్‌-2026 పరీక్షకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక పోలీసులతోపాటు పారామిలిటరీ బలగాలతో భద్రత కల్పించేందుకు సిద్ధమైంది. ఈ నెల 21న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌లలో ఉన్న ప్రధాన కేంద్రాల నుంచి నీట్‌ ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్‌ జవాబు పత్రాలను దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు అక్కడి నుంచి పరీక్ష జరిగే పట్టణాలు, కేంద్రాలకు తరలించనున్నారు. సీఆర్‌పీఎఫ్‌, సీఐఎ్‌సఎఫ్‌ పారా మిలిటరీ బలగాల భద్రత మధ్య రోడ్డు మార్గంలో, అవసరమైన చోట విమానాలు, హెలికాప్టర్లలో ఈ తరలింపు ప్రక్రియ జరగనుందని ‘జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ)’ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, నీట్‌ పరీక్ష సమయాన్ని ఎన్‌టీఏ 15 నిమిషాలు పొడిగించింది. గ‌త నెల 3న నిర్వ‌హించిన నీట్ ఎగ్జామ్ ర‌ద్దైయిన విష‌యం తెలిసిందే. పేప‌ర్ లీకేజీల కార‌ణంగా ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -