మండల ప్రజలపై నెలకు రూ.2.40 లక్షలు
నవతెలంగాణ – మల్హర్ రావు
సామాన్యుడి వంటగదిలో మరోమారు ‘గ్యాస్’ మంటలు రేగాయి.రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో ఇప్పటికే సతమతం అవుంతున్న పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభు త్వం మరోసారి వంటింట్లో బండ గ్యాస్ ధర పెంచింది. గృహా అవసరాలకు వినియోగించే (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్ ధరనును ఇటీవల రూ.29 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి రావడంతో వినియోగదారులు ఒక్కసారిగా బిత్తెరపోయారు.మూడు నెలల క్రితం మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.60 మేర పెంచి షాక్ ఇచ్చింది.
ఆ భారం నుంచి కోలుకోకముందే, ఇప్పుడు మరోమారు రూ.29 పెంచింది.తాజా పెంపుతో మండలంలో గ్యాస్ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో రూ.1,013కు చేరుకుంది.సిలిండర్ ధర రూ.వేయి దాటడంతో పేద, మధ్యత రగతి ప్రజలు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.గ్యాస్ సిలిండర్ ధర పెంపు ప్రభావం మండల తీవ్రంగా పడనుంది. మండలంలో ఇండేన్ గ్యాస్ కంపెనీ చెందిన డొమెస్టిక్ కనెక్షన్లు మొత్తం 8,013 ఉన్నాయి. పెరిగిన రూ.29 ధరతో పోల్చి చూస్తే మండలంలో గ్యాస్ వినియోగదారులపై నెలకు రూ.2.40 లక్షలఅదనపు భారం పడనుంది.
కట్టెల పొయ్యి నయం: తిరుమల గృహిణి
ప్రభుత్వం వరుసగా గ్యాస్ సిలిండర్ ధర పెంచుకుంటూ పోతుంది. ఇప్పుడు సిలిండర్ ధర రూ.వేయి దాటడంతో కొనలేని పరిస్థితి ఉంది.ఇప్పటికే వంట నూనెలు,నిత్యావసర సరు కుల ధరలు విపరీతంగా పెరిగాయి.మళ్లీ గ్యాస్ ధర పెంచింది. ఇక గ్యాస్ కన్నా కట్టెల పొయ్యిని వాడటమే మంచిది.



