Sunday, June 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅంతే గొప్పగా చెప్పుకుంటారు

అంతే గొప్పగా చెప్పుకుంటారు

- Advertisement -

దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. ఈ చిత్రాన్ని మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా నిర్మాతలు ‘నాట్ ఎ టీజర్’ను లాంచ్ చేశారు. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ,’జూలై 3న మా సినిమా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని మిగతా ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా అంతే స్థాయిలో ఆదరిస్తారని నమ్ముతున్నాను. తెలుగులో ఒక క్రేజీ ఫిల్మ్ వచ్చిందని గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుంది. మనం విదేశాలకు వెళ్లినప్పుడు బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, ఈ సినిమా గురించి కూడా అంతే గొప్పగా చెప్పుకుంటారు. ఇది నా ప్రామిస్. తెలుగు ప్రేక్షకులందరూ గర్వపడేలా ఈ సినిమాను చేశాం. వెంకటేష్ మహా తన ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం పనిచేశాడుఅని తెలిపారు. 'మహేష్ బాబు, నమ్రతకి థాంక్యూ వెరీ మచ్. వాళ్లు ఈ సినిమాను అర్థం చేసుకుని, నమ్మారు కాబట్టే ఇది ఇక్కడివరకు వచ్చింది. ఇంత పెద్ద కొలాబరేషన్ చేసిన అనురాగ్, శరత్‌లకు కూడా ధన్యవాదాలు. ఈ సినిమా తీయడం అంత సులభమైన విషయం కాదు. చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. సత్య లాంటి నటుడు ఉన్న సమయంలో నేను దర్శకుడిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన చిత్రం. తెలుగు సినిమాలో కూడా ఇది కచ్చితంగా ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను. ఇది అందరినీ అలరించే సినిమా అని డైరెక్టర్ వెంకటేష్ మహా చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -