'అనంత పద్మనాభ స్వామి రథయాత్ర మన సంస్కృతి, మూలాలను నెక్స్ట్ జనరేషన్‌కు పరిచయం చేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నం. స్వామి ఆశీస్సులతో 'నాగ బంధం ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాంఅని దర్శకుడు అభిషేక్ నామా అన్నారు. విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రధారులు. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఈ ప్రచార యాత్రను రూపొందించారు. శనివారం ఆనంత పద్మనాభ స్వామి రథ యాత్రని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రథయాత్ర ఈవెంట్‌లో డైరెక్టర్ అభిషేక్ నామా మాట్లాడుతూ,'ఈ సినిమా తర్వాత విరాట్ అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది. జునైద్, అభి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వారి మ్యూజిక్ మీ అందరికీ నచ్చుతుంది అని తెలిపారు. ‘రెండేళ్ల పాటు శ్రమించి తెరకెక్కించాం. అనంత పద్మనాభ స్వామి రథయాత్రలో భాగంగా మేము అనేక నగరాలను సందర్శించ బోతున్నాం. మా దర్శకుడు అభిషేక్ నామా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నన్ను భాగం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మా నిర్మాతలు భారీ బడ్జెట్‌తో, ఎంతో ధైర్యంగా నిర్మించారు` అని హీరో విరాట్ కర్ణ చెప్పారు.
థ్రిల్ చేసే ‘నాగ బంధం
- Advertisement -
- Advertisement -



