Sunday, June 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించిన ఎంపీ సురేష్ షెట్కర్

సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించిన ఎంపీ సురేష్ షెట్కర్

- Advertisement -

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా..
త్వరలోనే 161 బి జాతీయ రహదారి పనులు ప్రారంభం..
మద్నూర్ లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి
నవతెలంగాణ-మద్నూర్

జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ఆదివారం సాయంత్రం మూడు రాష్ట్రాల సరిహద్దుల గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని అన్నారు. మద్నూర్ నుండి బోధన్ మార్గం 161 బి జాతీయ రహదారి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉందని విలేకరులు ప్రశ్నించగా.. కేంద్రీయ విద్యాలయం కోసం తన వంతు కృషి చేస్తానని, విద్యాలయానికి స్థలం ఐదు ఎకరాలు అవసరమని వెల్లడించారు. ఈ విషయమై స్థానిక తహశీల్దార్ తో చరవాణిలో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ క్రమంలో వెంటనే స్పందించిన తహశీల్దార్ స్థలం కేటాయింపు కోసం త్వరలోనే నివేదికలు అందజేస్తానని తెలిపినట్లు ఎంపీ విలేకరులకు చెప్పారు. ఎంపీగా అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక సర్పంచ్ దిగంబర్ తమ గ్రామానికి రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు అవసరమని కోరారు. దానికి సంబంధించిన ఇస్ట్రిమెంటు తయారుచేసి తనను కలిస్తే నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చివరలో చిన్న ఎక్లారా సర్పంచ్ మాధవరావు, ఆవల్గావ్ గ్రామ సర్పంచ్ కుమారుడు ఎంపీని కలిసి శాలువలతో ప్రత్యేకంగా సన్మానించారు. అదేవిధంగా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచులకు ఎంపీ సూచించారు. కార్యక్రమంలో కుర్ల గ్రామ నాగేష్ పటేల్, మద్నూర్ మాజీ జెడ్పిటిసి సాహెబ్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -