- Advertisement -
విశాఖపట్నం : విశాఖ డెయిరీ యాజమాన్యం పాల విక్రయ ధరలను పెంచుతూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 500 మిల్లీలీటర్ల పరిమాణంగల హోమోజినైజ్డ్ డబుల్ టోన్డ్ పాల ధర రూ.26 నుంచి రూ.27కి, టోన్డ్ పాల ధర రూ.28 నుంచి 29కి, హోమోజినైజ్డ్ టోన్డ్ పాల ధర రూ.28 నుంచి రూ.29కి పెంచింది. వెయ్యి మిల్లీలీటర్ల పరిమాణంగల ప్యాకెట్ గతంలో రూ.56 ఉండగా రూ.58కు చేరింది. 500 మిల్లీలీటర్ల స్టాండరైజ్డ్ పాల ధర రూ.31 నుంచి రూ.32కి పెంచింది. ఈ ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయని పేర్కొంది. రోజుకు 6.80 లక్షల లీటర్ల పాలను విశాఖ డెయిరీ విక్రయిస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై తాజాగా పాల భారమూ పడినట్టయింది.
- Advertisement -



