Tuesday, June 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు యూరియా విషయంలో ఆందోళన వద్దు

రైతులు యూరియా విషయంలో ఆందోళన వద్దు

- Advertisement -

– జిల్లాకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది
– బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రైతులు యూరియా విషయంలో ఆందోళన చెందవద్దని, జిల్లాకు సరిపడా యూరియా అందుబాటులో ఉందనీ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చొరవతో 39వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా నిజామాబాద్ జిల్లాలో నిల్వ ఉందని తెలిపారు.దాని నుండి 16 వేల మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లాకు చెందిన ఒక లక్ష యాభై వేల మంది రైతులు అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకుని యూరియాని డెలివరీ చేసుకున్నారన్నారు. ఇంకా 23వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా అందుబాటులో ఉన్నదనీ తెలిపారు.గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భ్రష్టు పట్టుపోయి డిఫాల్ట్ గా మిగిలిపోయిన సొసైటీల కారణంగా యూరియాను డబ్బులు కట్టి తీసుకురాలేని పరిస్థితిల్లో రైతులకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు.

రైతులు మీ మీ పరిధిలోని సొసైటీలకు వెళ్లి ఇప్పుడున్న చైర్మన్లు, అధికారుల మెడలు వంచి డబ్బులు కట్టించాలని సూచించారు. డబ్బులు కట్టించే బాధ్యతను మీరు తీసుకోండి, యూరియాను సొసైటీలకు ఇప్పించే బాధ్యతను నేను తీసుకుంటానని పేర్కొన్నారు. సొసైటీలు వారి చేతకాని విధానాన్ని ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారనీ, రైతులు ప్రతిపక్షాల మాటలకు మోసపోవద్దునీ హితవు పలికారు.అప్లికేషన్ ద్వారా రైతులకు ఇబ్బంది అవుతున్న మాట వాస్తవమేనన్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 5 సంచులు అవసరం ఉన్నవారు 20 సంచులు దాచి పెట్టుకోవడం వల్ల కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ ఉద్దేశ్యంతో అప్లికేషన్ విధానాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. యూరియా అందుబాటులో ఉందనీ, రైతులు ఆందోళన చెందకుండా అర్థం చేసుకోవాల్సిందిగా సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -